: పరీక్ష ఫీజు కోసం పనిమనిషిగా మారిన బాక్సింగ్ ఛాంపియన్!


సమాజంలో పెరుగుతున్న అసమానతలు, దిగజారుతున్న జీవన పరిస్థితులను కళ్లకు కట్టే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హర్యానాలోని కైతాల్ కు చెందిన రిషూ మిట్టల్ 2014లో స్టేట్ లెవెల్ మహిళా బాక్సింగ్ పోటీలో ఛాంపియన్ గా నిలిచింది. అయితే పదవ తరగతి పరీక్ష ఫీజు కోసం పనిమనిషిగా మారిపోయింది. మేరీకోంలా తయారవుదామని ఎన్నో కలలతో బాక్సింగ్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించిన రిషూను పరిస్థితులు వెక్కిరించాయి. తల్లిదండ్రులను కోల్పోయిన రిషూ సోదరుడు చిరుద్యోగి. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆమె ఆర్థిక పరిస్థిితి సహకరించకపోవడంతో, ఆమె నాలుగిళ్లలో పాచిపని చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News