: ఇది కూడా పాయె!... రాయల్ చాలెంజర్స్ నుంచి మాల్యా బ్రాండ్స్ అవుట్!


విజయ మాల్యా కీర్తి కిరీటంలోని మరో 'వజ్రం' రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆయన చేతి నుంచి పూర్తిగా జారిపోయే సమయం వచ్చేసింది. ఒకప్పుడు లిక్కర్ కింగ్ గా, విమానయాన సంస్థ అధినేతగా, వీవీఐపీగా నీరాజనాలు అందుకున్న ఆయన చేతిలోని ఒక్కో పరిశ్రమా నష్టాల్లో మునుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, రాయల్ చాలెంజర్స్ జట్టుకు యునైటెడ్ స్పిరిట్స్ అందిస్తున్న అన్ని బ్రాండ్ సేవలనూ ఉపసంహరించుకుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ-20 క్రికెట్ పోటీల్లో మాల్యా సంస్థల లోగోల్లో కింగ్ ఫిషర్ మినహా మరే బ్రాండ్స్ చాలెంజర్స్ జట్టుతో కనిపించబోవు. ఈ మేరకు జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. ఈ కొత్త డ్రెస్ పై యూఎస్ఎల్ లోగో లేదు. దీంతోపాటు టీంతో కలసి గత 7 సంవత్సరాల పోటీల్లో ఉత్సాహపరిచిన వైట్ మిస్చీఫ్ గర్ల్స్ (చీర్ లీడర్స్) తోనూ డీల్ ను యూఎస్ఎల్ రద్దు చేసుకుంది. కాగా, మాల్యా నిర్వహిస్తున్న బ్రాండ్స్ లో యునైటెడ్ బీవరేజస్ అధీనంలోని కింగ్ ఫిషర్ మాత్రమే ఈ దఫా ఐపీఎల్ పోటీల్లో కనిపించనుంది.

  • Loading...

More Telugu News