: శేషాచలం ఎన్ కౌంటర్ పై ముగిసిన సీఎం అత్యవసర సమీక్ష


తిరుపతిలోని శేషాచలం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ పై ఏపీ సచివాలయంలో సీఎం అత్యవసర సమీక్ష ముగిసింది. డీజీపీ రాముడు, ఇతర అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై చర్చించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల ఫోటోలు విడుదల చేసి బంధువులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అటు ఈ ఎదురు కాల్పులపై గవర్నర్ కు ఫోన్ లో సీఎం వివరించారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News