: విఫలమైన భారత క్షిపణి విధ్వంసక పరీక్ష


దేశంపైకి దూసుకు వచ్చే క్షిపణులను ఆకాశంలోనే అడ్డగించే బాలిస్టిక్ మిసైల్ పరీక్ష విఫలం అయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) ఇంటర్సెప్టార్ మిసైల్ ను ఓడిసాలోని భద్రక్ తీర సమీపంలోని వీలర్ ద్వీపం నుంచి దీన్ని పరీక్షించగా, లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయోగించిన కొద్ది క్షణాలకే మిసైల్ బంగాళాఖాతంలో కూలిపోయిందని వివరించారు. మిసైల్ నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎం.వీ.కే.వీ.ప్రసాద్ పేర్కొన్నారు. డీఆర్ డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి విధ్వంసక మిసైల్ 7.5 మీటర్ల పొడవు, 1.2 టన్నుల బరువు ఉంటుంది. కాగా, ఇదే విధమైన పరీక్షను 2010 జులైలో నిర్వహించగా, అప్పుడు కూడా లక్ష్యాన్ని చేరుకోవడంలో మిసైల్ విఫలం అయింది.

  • Loading...

More Telugu News