: తెలంగాణకు అత్యాధునిక ఆయుధాలివ్వండి... రాజ్ నాథ్ కు దత్తాత్రేయ విజ్ఞప్తి
వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని ఆయన రాజ్ నాథ్ ను కోరారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు చరమగీతం పాడేలా కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న ఉగ్రవాదుల కాల్పులు, పోలీసుల ఎన్ కౌంటర్లపై దత్తాత్రేయ, రాజ్ నాథ్ కు సమగ్ర వివరాలందజేశారు.