: ‘శేషాచలం’లో మారణాయుధాలతో స్మగ్లర్లు... హైదరాబాదులో ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ


చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కోసం వెళ్లిన కూలీల వద్ద మారణాయుధాలున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కంటికి కనిపించిన పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న స్మగ్లర్లపై గడచిన రాత్రి పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. నిన్న రాత్రి 200 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులకు తారసపడ్డారు. ఈ క్రమంలో తమపై రాళ్ల దాడికి దిగిన కూలీలపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 20 మంది కూలీలు చనిపోగా, మిగిలినవారంతా తప్పించుకున్నారు. ప్రస్తుతం వారంతా శేషాచలం అడవుల్లోనే మాటు వేసి ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అడవిలోకి అడుగుపెట్టేందుకు సాక్షాత్తు పోలీసు అధికారులే జంకుతున్నారు. ఇదిలా ఉంటే, ఎన్ కౌంటర్ పై ఏపీ సర్కారు వేగంగా స్పందించింది. అత్యవసర కేబినెట్ భేటీకి సీఎం చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో ఆయన మరికాసేట్లో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News