: వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్... వికారుద్దీన్ సహా ఐదుగురు ఐ.ఎస్.ఐ. ముష్కరులు హతం


వరంగల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఎన్ కౌంటర్ జరిగింది. గుజరాత్ హోం మంత్రిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐ.ఎస్.ఐ ఉగ్రవాది వికారుద్దీన్ తో పాటు సదరు నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు యత్నించిన వికారుద్దీన్ గ్యాంగ్ యత్నాన్ని వరంగల్ పోలీసులు తిప్పికొట్టారు. నేడు నాంపల్లి కోర్టులో జరగనున్న విచారణకు వికారుద్దీన్, మరో నలుగురు ఉగ్రవాదులను హాజరుపరచాల్సి ఉంది. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య ఉగ్రవాదులను వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాదుకు తరలించే క్రమంలో ఎస్కార్ట్ వాహనం ఆలేరు-జనగాం మధ్యకు చేరుకోగానే ఎస్కార్ట్ సిబ్బందిపై వికారుద్దీన్ గ్యాంగ్ దాడి చేసింది. అంతేకాక పోలీసులు తేరుకునేలోగానే వాహనం దిగి పారిపోయేందుకు యత్నించారు. అయితే వెనువెంటనే తేరుకున్న పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసుల కాల్పుల్లో వికారుద్దీన్ తో పాటు అతడి వెంట పారిపోతున్న నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని వరంగల్ రేంజి డీఐజీ మల్లారెడ్డి ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News