: ముంబయిలో వీధుల్లో సల్మాన్ ఖాన్ సైక్లింగ్


ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ముంబయి నగర వీధుల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల సైకిల్ తొక్కి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసి విషయాన్ని తెలిపాడు. అనుభవం వున్న వాడిలా హ్యాండిల్ వదిలేసి మరీ సైకిల్ తొక్కాడు. అలాగే ఆయన వెంట బాడీగార్డులు కూడా లేరు. ఇక కొన్ని వీధుల్లో తనను గుర్తుపట్టిన స్థానికులు, అభిమానులు, పిల్లలతో ముచ్చటించి వారితో ఫోటోలు దిగాడట. అయితే సల్మాన్ సైకిల్ రైడ్ కి వెళ్లడం ఇది తొలిసారేమి కాదు. గతంలో పలుసార్లు ముంబయి వీధుల్లో ఇలానే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు!

  • Loading...

More Telugu News