: ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్ లో గొడవ ఎందుకంటే...!


ఎయిర్ ఇండియా విమానంలో కెప్టెన్, కో- పైలట్ మధ్య రెండు రోజుల క్రితం జరిగిన వివాదం కలకలం సృష్టించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందా? అని ఆరా తీసిన అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అసలు జరిగింది ఏమంటే... కో- పైలట్ కన్నా పైలట్ చిన్నవాడు కావడంతో టేకాఫ్ సమయంలో 'అంకుల్' అని సంబోధించాడట. దీంతో 'నన్ను అంకుల్ అనడానికి నువ్వు ఎవరు?' అంటూ, ఆగ్రహంతో ఊగిపోతూ, కెప్టెన్ ను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News