: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం... కొత్త పెళ్లికొడుకు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు


కడప జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తిరుమల వెంకన్న దర్శనానికి వెళుతూ, స్వామివారిని దర్శించుకోకుండానే ప్రమాదం బారిన పడ్డారు. వివరాల్లోకెళితే... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్(27)కు అదే మండలానికి చెందిన లక్ష్మిస్వాతితో సోమవారం ఉదయం వివాహమైంది. వివాహానంతరం స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న కొత్త దంపతులు తూఫాన్ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు. నేటి తెల్లవారుజామున కాజీపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. దీంతో తూఫాన్‌ లో ప్రయాణిస్తున్న పెళ్లికొడుకు వెంకట ప్రసాద్‌తో పాటు అతని బంధువు నర్సమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో ఉన్న మిగతా పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహాయంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పెళ్లికూతురు లక్ష్మిస్వాతితో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News