: ముస్లింలకు అండగా ఉంటాం: మోదీ
ముస్లింలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని కార్యాలయంలో పలు ముస్లిం సంఘాల ప్రజా ఫిర్యాదు విభాగంలో ముస్లిం నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన పలు విషయాలపై చర్చించారు. దీంతో పీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. పరమత సహనంతో జాతి ఐక్యతకు పాటుపడతానని ఆయన వారికి మాటిచ్చారు. భారత్ ఆర్థికంగా బలోపేతం కావడానికి ముస్లింలు చేయూతనివ్వాలని ఆయన వారిని కోరారు. ముస్లిం సోదరుల అవసరాలకు అనుగుణంగా గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.