: ఈ 12 ఏళ్లు అశోక్ ఏమయ్యాడు?...సల్మాన్ ని తప్పించడానికొచ్చాడా?: ప్రాసిక్యూషన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో డ్రైవర్ అశోక్ 12 ఏళ్లుగా ఏమయ్యాడని ప్రాసిక్యూషన్ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన చివరి వాదోపవాదాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తన అనుమానాల్ని న్యాయస్థానం ముందుంచింది. డ్రైవర్ అశోక్ కుమార్ 12 ఏళ్లుగా ఈ విషయాన్ని న్యాయస్ధానానికి చెప్పకుండా, ఇప్పుడొచ్చి ఆ ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్నది తానేనని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రాసిక్యూషన్ వాదించింది. 2002లో సల్మాన్ ఖాన్ కారు ఢీ కొని ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసులో చివరి సారి డ్రైవర్ తప్పు సల్మాన్ ది కాదని, తాను నడుపుతున్నానని న్యాయస్థానం ముందు నేరం అంగీకరించాడు.