: తెలివితేటలు ప్రదర్శించిన ఉగ్రవాదులు!


నల్గొండ జిల్లా జానకీపురం ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసిన ఉగ్రవాదుల ఆనుపానులకు చెందిన పూర్తి వివరాలు సేకరించే పనిలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బిజీగా ఉంది. పోలీసు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు తప్పించుకుపోయిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఉగ్రవాదులు బ్యాగుతో దిగడంతో ఎన్ కౌంటర్ అనంతరం, బ్యాగ్ కేంద్రంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు ఆరు జిల్లాల్లో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్వపల్లిలో ఉగ్రవాదులు 48 గంటల పాటు విడిది చేసినట్టు గుర్తించారు. వారు విడిది చేసిన ప్రాంతంలో రెండు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల జబల్పూర్ ట్రైన్ లో ఒడిశాకు చెందిన వినోద్ అనే వ్యక్తి యొక్క పర్సు కొట్టేసి, అతని వివరాలతో సిమ్ కార్డులు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. వీటిని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సిమ్ కార్డుల నుంచి అన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సిరువెల్లలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాగ్ తో పాటు పరారైన మూడో తీవ్రవాది గురించి ఆరా తీస్తున్నారు. కాగా, అతని బ్యాగులో సిమీకి సంబంధించిన లావాదేవీల వివరాలు కలిగిన ల్యాప్ ట్యాప్, ఆయుధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాగా, నేరుగా తమ వివరాలు తెలియకుండా ఉగ్రవాదులు తెలివిగా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News