: రాంచీ వీధుల్లో పాతబుల్లెట్ పై ధోనీ షికారు
వరల్డ్ కప్ ముగిసింది. ఐపీఎల్ సీజన్ 8 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ, కుమార్తె జివా పుట్టిన తరువాత కావాల్సినంత సమయాన్ని కుటుంబంతో గడపలేదు. దీంతో, వరల్డ్ కప్ ముగిసిన తరువాత క్షణం లేటు చేయకుండా, రాంచీ చేరుకున్నాడు. కుమార్తెను చూసి మురిసిపోయాడు. కుమార్తెతో తీసుకుని రైనా వివాహానికి హాజరయ్యాడు. మూడున్నర నెలల ఆస్ట్రేలియా పర్యటనతో సొంతూరులో రోడ్లను పలకరించేందుకు తనకు ఎంతో ఇష్టమైన బుల్లెట్ ను బయటికి తీశాడు. ముఖానికి హెల్మెట్ తగిలించి, రోడ్డుమీద రయ్యిమంటూ దూసుకుపోయాడు. ధోనీ దగ్గర 28 బైక్ లు ఉన్నాయి. అందులో మూడు ఇంజిన్ల పాతతరం బుల్లెట్ అంటే ధోనీకి చాలా ఇష్టం. దాని బీటింగ్ కారణంగా ఎవరూ తనవైపు చూడరని, చూసినా హెల్మట్ కారణంగా, తనను ఎవరూ గుర్తు పట్టరని ధోనీ చెబుతాడు.