: 'దబాంగ్ 3' మొదలవడానికి రెండేళ్లు పడుతుంది: అర్బాజ్ ఖాన్


బాలీవుడ్ సూపర్ హిట్ 'దబాంగ్' చిత్రానికి మూడో కొనసాగింపు రాబోతోంది. అయితే ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి సంవత్సరం లేదా రెండేళ్లు పడుతుందని దర్శకుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ అంటున్నాడు. "దబాంగ్ 3' చర్చల దశలో ఉంది. ఎప్పుడైతే సల్మాన్ కు తన సినిమాలు, మిగతా పనులు ఉండవో అప్పుడే మేమిద్దరం కూర్చొని దీనిపై మాట్లాడుకుంటాం" అని ఓ పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా అర్బాజ్ మీడియాకు చెప్పాడు. ఆ తరువాతే దాని స్క్రిప్టును తయారుచేస్తామంటున్నారు. ఈ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతలు మరొకరికి ఇస్తామని, తాను నిర్మాతగా ఉంటానని వివరించాడు. 2010లో వచ్చిన 'దబాంగ్'ను నిర్మించిన అర్బాజ్, తరువాత సీక్వెల్ కు తానే దర్శకనిర్మాణ బాధ్యతలు వహించాడు.

  • Loading...

More Telugu News