: ‘అనంత’లో పడగ విప్పిన ఫ్యాక్షన్... నాగసముద్రంలో ఇద్దరిని నరికి చంపిన ప్రత్యర్ధులు


ఫ్యాక్షన్ కు నిలయమైన అనంతపురం జిల్లాలో మరోమారు కక్షలు పడగ విప్పాయి. జిల్లాలోని గుంతకల్లు మండలం నాగసముద్రంలో ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్ధులు పాశవికంగా నరికి చంపారు. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి, లాలెప్ప అనే వ్యక్తులు ఈ దాడిలో అక్కడికక్కడే నేలకొరిగారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. జంట హత్యల నేపథ్యంలో గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News