: ఎస్సై సిద్ధయ్య కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ


సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ సిద్ధయ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఎస్సై సిద్ధయ్య కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని కామినేని ఆస్పత్రికి వెళ్లిన జగన్, సిద్ధయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిపై జగన్, ఆస్పత్రి వైద్యులను వివరాలడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News