: రుణమాఫీ కాలేదంటూ ఏపీ సచివాలయానికి రైతు బాధితులు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది


హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఈరోజు 200 మంది రైతు బాధితులు వచ్చారు. అయితే గేటు వద్దే వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రాష్ట్రంలో రెండో దశలోనూ తమకు రుణమాఫీ కాలేదని, అర్హత పత్రాలు ఉన్నా రుణమాఫీ వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వోలు, బ్యాంకు అధికారులు సమాధానం చెప్పడంలేదని తెలిపారు. దానికి సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని కలిసేందుకు వచ్చామని చెప్పారు. అయినప్పటికీ రైతులను లోపలికి అనుమతించలేదు.

  • Loading...

More Telugu News