: ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు...నామినేషన్లు వేసిన సీఎం రమేశ్, జేసీ కుమారుడు
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోనున్నాయి. ఎందుకంటే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవుల కోసం రాజకీయ ఉద్ధండులు రంగంలోకి దిగుతున్నారు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, ప్రధాన కార్యదర్శి పదవికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిలు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పదవుల ఎన్నిక ఏకగ్రీవమైతే ఫరవాలేదు కాని, పోటీ జరగాల్సి వస్తే మాత్రం హోరాహోరీ తప్పదని క్రీడారంగ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు కూడా తప్పవన్న వాదన వినిపిస్తోంది.