: గుంటూరు జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్కు ప్రారంభించిన చంద్రబాబు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం, వంకాయలపాడులో ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలసి ప్రారంభించారు. దేశంలోనే 9వదైన ఈ పార్కును 124 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. దాని ఏర్పాటుతో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల తయారీ స్థాపనల ముందడుగు పడింది. సుగంధ ద్రవ్యాల పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పార్కులో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఇతర అనుబంధ శాఖల ప్రదర్శన ఏర్పాటు చేశారు.