: నేరం చేయకున్నా... 11 ఏళ్లు జైల్లో మగ్గాను: అక్షరధామ్ నిందితుడి ఆవేదన


గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని అక్షరధామ్ ఆలయంపై 2002లో ఉగ్రవాదులు దాడి చేశారు. తాము పెట్టిన బాంబు పేలుళ్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఉగ్రవాదుల వద్ద లభించిన ఓ సూసైడ్ నోట్ కారణంగా ఈ నేరంతో ఏమాత్రం ప్రమేయం లేని మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం అరెస్టయ్యాడు. తనకు ఏ పాపం తెలియదన్న అతడి మాటలను గుజరాత్ పోలీసులు నమ్మలేదు. విచారణ పేరిట ఏకంగా 11 ఏళ్లు జైల్లో పెట్టారు. ఈ పదకొండేళ్ల పాటు అతడిని వివిధ రకాల ప్రశ్నలతో సతాయించారు. చెప్పలేని రీతిలో టార్చర్ పెట్టారు. కీలక మలుపులు తిరిగిన ఈ కేసు సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది. అక్షరధామ్ ఆలయంపై దాడికి, మప్తీకి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మఫ్తీని గుజరాత్ పోలీసులు విడుదల చేయక తప్పలేదు. జైల్లో సుదీర్ఘకాలం పాటు నరకం అనుభవించి గతేడాది మే 17న బయటకు వచ్చిన మఫ్తీ, జైల్లో పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసిన వైనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు పూనుకున్నాడు. ‘గ్యారా సాల్ సాలఖోన్ కే పీచే’ (జైలు లోపల పదకొండేళ్లు) పేరిట పుస్తకాన్ని రాశాడు. 200 పేజీలున్న ఈ పుస్తకం గుజరాత్ పోలీసుల దాష్టీకాన్ని పాఠకుల కళ్లకు కడుతోంది.

  • Loading...

More Telugu News