: టీవీ 'బ్రేకింగ్ న్యూస్'లపై మోదీ సెటైర్లు!
గతంలో కనీసం 'గాసిప్' కాలమ్ లో కూడా చోటు సంపాదించుకోలేని వార్తలు నేడు 'బ్రేకింగ్ న్యూస్' అవుతున్నాయని ప్రధాని మోదీ మీడియాకు చురకలేశారు. రాజకీయ నాయకులపై మీడియా స్క్రూటినీ పెరిగిపోయిందని వెల్లడించిన ఆయన, రోజులో 24 గంటల పాటూ మీడియా కన్ను రాజకీయ నేతలపై ఉందని అన్నారు. "పదవీకాలం ముగిసే ఐదు సంవత్సరాల్లో మాకు ఎంతో చెడ్డ పేరు వస్తోంది. వీటికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది" అని ఆయన న్యాయ సదస్సులో అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషన్, ఆర్టీఐ, లోక్ పాల్ వంటి సంస్థలకు మరిన్ని అధికారాలు ఇచ్చి తమను తామే ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నామని అన్నారు.