: ఇక్కడికొస్తే మీతో కలసినట్టు కాదు!: ఆర్ఎస్ఎస్ సమావేశంలో అజీం ప్రేమ్ జీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాటించాలని నిర్ణయించుకున్నట్టు కాదని అజీం ప్రేమ్ జీ వ్యాఖ్యానించారు. భారత కార్పొరేట్ రంగంలో పరిచయం అక్కర్లేని వ్యక్తిగా, విప్రో గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ రాష్ట్రీయ సేవా భారతి చేస్తున్న సంక్షేమ పనులను అభినందించేందుకే తాను వచ్చానని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన తాను ఆర్ఎస్ఎస్ లో కలసినట్టు భావించరాదని వివరణ ఇచ్చారు.