: ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన హీరో రణ్ వీర్ సింగ్


బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న 'బాజీరావు మస్తానీ' షూటింగ్ లో రణ్ వీర్ సింగ్ గాయపడ్డాడు. దీంతో ఆయన భుజానికి శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స జరుగుతుండగా కూడా ట్వీట్స్ చేస్తూ, అభిమానులను అలరించాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైనట్టు ఆయన ట్వీట్ చేశాడు. రణ్ వీర్ సింగ్ గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'రామ్ లీలా' సినిమాలో నటించిన సంగతి, ఈ సినిమా అతనికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News