: మోదీ కేంద్రీకృతపాలన దేశానికి ప్రమాదకరం: జైరాం రమేష్
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంగా పరిపాలన సాగుతోందని, ఇది ప్రమాదకర పరిణామమని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో గతంలో జరగని విధంగా, మోదీ పాలన సాగుతోందని అన్నారు. దీంతో దేశం మళ్లీ చీకటి పాలనలోకి వెళ్తున్నట్టు అనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 10 నెలల ఎన్డీయే పాలన చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుందని ఆయన చెప్పారు. పార్లమెంటులో ఏకాభిప్రాయంపై విశ్వాసం లేకనే మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ లు జారీ చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వ 'మాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమమ్ గవర్నమెంట్' అనే నినాదాన్ని 'మాగ్జిమమ్ ఆరొగెన్స్, మినిమమ్ గవర్నమెంట్' గా మర్చేసిందని ఆయన మండిపడ్డారు.