: మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొస్తాం... చర్యలు ప్రారంభించామన్న వెంకయ్య


అర్జంటైనాలోని ఆండీస్ పర్వతాలలో మృతి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు భౌతిక కాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే విషయమై ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలో మస్తాన్ మృతదేహం చెన్నై వరకు వస్తుంది. అక్కడి నుంచి మృతదేహాన్ని అతడి స్వగ్రామం గాంధీజనసంగం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. మస్తాన్ బాబు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న మస్తాన్ బాబు ఇలా మరణించడం తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ మస్తాన్ బాబు చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా సహాయక బృందాలు ఏరియల్ సర్వే నిర్వహించాయి. మస్తాన్ బాబు మృతదేహాన్ని శనివారం ఏరియల్ సర్వేలో గుర్తించారు.

  • Loading...

More Telugu News