: రాహుల్ కంటే సమర్థుడు లేరు...ఆప్ నేతలు పనిమీద శ్రద్ధ పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ రాంనారాయణ్ మీనా
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కంటే సమర్థవంతమైన నాయకుడు లేరని ఆ పార్టీ సీనియర్ నేత రాంనారాయణ్ మీనా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ సమర్థవంతమైన నాయకుడని, ఆయన సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం అందుకుంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్ తీరుపై ఆయన మండిపడ్డారు. గతంలో ఆప్ నేతలు ఇతరుల్ని విమర్శించేవారని, ఇప్పుడు వారిలో వారే విమర్శించుకుంటున్నారని అన్నారు. కనీసం ఏడాది పాటైనా ఆప్ నేతలు పనిమీద శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఆప్ నేతలు ఉద్యమం సమయంలో విలువలు ఉన్నట్టు అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. తమ విలువలు, విశ్వసనీయత ఏపాటిదో అధికారం దక్కిన తరువాత బయటపడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.