: మీ అమ్మలు కూడా మహిళలే!:మోహన్ బాబు
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి గోవాలోని ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ లో జరిగిన చేదు అనుభవంపై టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో, ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఒక స్త్రీయేనని అన్నారు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టకూడదని ఆయన పేర్కొన్నారు. స్త్రీల అభ్యున్నతి మనందరి బాధ్యత అని ఆయన సూచించారు.