: కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి 'నోకియా' అవుట్... 'జియోనీ' ఇన్!


ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న 'నోకియా' సీజన్8 స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగింది. దీంతో చైనాకు చెందిన మొబైల్ సంస్థ 'జియోనీ' నైట్ రైడర్స్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. 2014లో 'నోకియా'తో నైట్ రైడర్స్ జట్టు చేసుకున్న ఒప్పందం ముగియడంతో, ఆ జట్టుకు తాజా స్పాన్సర్ గా 'జియోనీ' వ్యవహరించనుంది. దీనిపై షారూఖ్ ట్విట్టర్లో 'జియోనీ ఇండియా తమ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తోందని, ఇది చాలా ఆనందంగా ఉందని' పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News