: వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిపారు: ప్రత్యక్ష సాక్షి


నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులపై విరుచుకుపడినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. జానకీపురానికి చెందిన సమ్మయ్య ఉదయం 8 గంటల ప్రాంతంలో పొలం పనుల నిమిత్తం ఊరి బయటకు వచ్చాడు. ఇంతలో రమేష్, అనిల్ అనే పోలీసులు బైక్ పై వచ్చారు. వాళ్లిద్దరూ తనకు తెలియడంతో వారిని పలకరించగా, ఇటువైపుగా ఎవరైనా కొత్త వ్యక్తులిద్దరు వెళ్లారా? అని వారు ప్రశ్నించారు. ఓ ఐదు నిమిషాల తరువాత బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, తాను దాక్కున్నామని అతను చెప్పాడు. వారు కొంత దూరం ముందుకెళ్లి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడినట్టు తాను చూశానన్నాడు. ఇంతలో రెండో వ్యక్తి వేసుకున్న షర్టు తీసేసి, టీషర్టు ధరించినట్టు ఆయన తెలిపాడు. చేతిలో తుపాకులకు టవల్ కప్పి ఉంచారని సమ్మయ్య చెప్పాడు. తరువాత పదినిమిషాల్లోపే పది నుంచి 15 రౌండ్ల కాల్పులు వినిపించాయని, దీంతో భయంతో పొలంలోనే ఉండిపోయామని ఆయన చెప్పాడు. వారిద్దరూ మరణించారని తెలిసిన తరువాతే తాము సంఘటనాస్థలిని చూశామని సమ్మయ్య తెలిపాడు.

  • Loading...

More Telugu News