: ఐపీఎల్ 8 వేడుకలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ ల డ్యాన్స్


బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లు ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో అదిరిపోయే డ్యాన్సులతో అభిమానులను అలరించనున్నారు. ఈ నెల 7న కోల్ కతాలో ఐపీఎల్ 8 సీజన్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సాయంత్రం 7.30 నుంచి ప్రారంభమవనున్న ఐపీఎల్ వేడుక రెండు గంటలపాటు అట్టహాసంగా జరుగుతుందని చెప్పారు. కాగా, హృతిక్, షాహిద్ తో పాటు బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్, సంగీత దర్శకుడు ప్రీతమ్, అనుష్కశర్మ కూడా అలరించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News