: అత్యుత్తమ సీఎంలలో మూడో వ్యక్తిగా ఎంపికైన చంద్రబాబు


దేశంలోని ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యుత్తమ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంపికయ్యారు. ఈ జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి స్థానాన్ని ఆక్రమించగా, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రెండో స్థానాన్ని ఆక్రమించడం విశేషం. అద్భుత రీతిలో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు 'ఇండియా టుడే' ఒక ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో అరవింద్ కేజ్రీవాల్ గొప్ప సీఎం అంటూ 17 శాతం మంది అభిప్రాయపడగా, అఖిలేష్ యాదవ్ ను 8 శాతం, చంద్రబాబును 6 శాతం మంది ఎంపిక చేశారు. 'మూడ్ ఆఫ్ ది నేషన్ అండ్ బెస్ట్ చీఫ్ మినిష్టర్ అక్రాస్ ఇండియా' పేరుతో ఈ సర్వేను నిర్వహించారు. ఏపీకి చెందిన వారిలో 55 శాతం మంది చంద్రబాబును బెస్ట్ సీఎంగా ఎంపిక చేశారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే, మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను 20 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని సర్వేలో తేలింది.

  • Loading...

More Telugu News