: న్యూజిలాండ్ లో ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిన భారత విద్యార్థి


న్యూజిలాండ్ సముద్ర తీరంలో విహారానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న భారతీయ విద్యార్థి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించాడు. ఇండియాకు చెందిన బుద్దేశ్ పళని (26) న్యూజిలాండ్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సోమవారం సముద్రంలో విహారానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి పోతుండగా, సముద్రంలో విహరిస్తున్న నలుగురు యువతీయువకులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పళని మృతి చెందాడు. తొలుత పళనిని ఎవరు గుర్తించలేకపోగా, ఆయన ఫొటోలతో పలు వార్తా కథనాలు ప్రసారం కావడంతో, స్నేహితులు గుర్తించి ప్రమాద వార్తను అతడి కుటుంబ సభ్యులకు చేరవేశారు.

  • Loading...

More Telugu News