: నెలాఖరుకల్లా నూతన మద్యం పాలసీ ప్రకటిస్తాం: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర
నెలాఖరుకల్లా నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నూతన మద్యం విధానంపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం విధానాల తీరుతెన్నులు పరిశీలించామని మంత్రి వెల్లడించారు. అన్ని అంశాలు పరిశీలించి సరికొత్త లిక్కర్ పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. అలాగే, బందరు పోర్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని ఆయన తెలిపారు.