: దాల్మియా చేతుల్లో భారత క్రికెట్ భద్రం: గంగూలీ


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంతో బీసీసీఐ ఇమేజ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, బోర్డు అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా పగ్గాలు అందుకున్న నేపథ్యంలో, భారత క్రికెట్ భవితవ్యంపై ఢోకా అక్కర్లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. దాల్మియా సురక్షితమైన హస్తాల్లో భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన దాల్మియా, మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా రావడం తమకెంతో సంతోషదాయకమని దాదా పేర్కొన్నాడు. దాల్మియాను భారత క్రికెట్ అత్యున్నత పదవిలో చూడడం పట్ల గర్విస్తున్నానని తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన నెల రోజుల తర్వాత దాల్మియాను కోల్ కతాలో ఘనంగా సన్మానించారు. క్షుదీరామ్ అనుశీలన్ కేంద్రంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News