: భారతీయులు రెండు ఓడలు, మూడు విమానాల్లో బయటపడ్డారు!


అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ నుంచి రెండు ఓడలు, మూడు విమానాల్లో భారతీయులు స్వదేశానికి బయల్దేరారని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలిపారు. కొచ్చిలో ఆయన మాట్లాడుతూ, సుమారు 1900 మంది భారతీయులు భారత్ బయల్దేరారని చెప్పారు. యెమెన్ లో ఉన్న భారతీయులను గుర్తించడం కష్టంగా మారిందని, రెడ్ క్రాస్ లాంటి సంస్థలు భారతీయులకు సహాయం చేయాలని ఆయన సూచించారు. సంబంధిత ఓడరేవులు, విమానాశ్రయాలకు వారిని పంపించాలని ఆయన కోరారు. యెమెన్ లో ఉన్నవారిలో అత్యధికులు కేరళీయులే కావడంతో ఆయన వారిని రప్పించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, యెమెన్ ఎంబసీలతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. రెండు విమానాలు ముంబైకి, ఒక విమానం కొచ్చికి నేటి రాత్రికి చేరుకుంటాయని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News