: కో-పైలట్ కిరాతకుడు... అదను చూసి దారుణానికి పాల్పడ్డాడు!


జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చేసే క్రమంలో కో-పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ అత్యంత కిరాతకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. 149 మంది ప్రాణాలను బలిగొన్న కో-పైలట్ లుబిట్జ్ ఎంత క్రూరంగా వ్యవహరించాడో నిన్న సహాయక బృందాలకు ఆల్ప్స్ పర్వతాల్లో దొరికిన రెండో బ్లాక్ బాక్స్ కళ్లకు కట్టింది. అదను చూసి ఆ దుర్మార్గుడు సామూహిక హత్యకు పథకం రచించాడు. పైలట్ బయటకు వెళ్లగానే, ఆటోపైలట్ మోడ్ ఆన్ చేసి, సెట్టింగ్స్ మార్చి, విమానం ఎగిరే ఎత్తును బాగా తగ్గించాడు, ఆ సమయంలో విమానం కేవలం 100 అడుగుల ఎత్తులో ఎగిరిందంటే ఎంత కిందికి దిగిందో అర్థం చేసుకోవచ్చు. వేగం విపరీతంగా పెంచేసి విమానాన్ని కూల్చడానికి ప్రయత్నించిట్టు రెండో బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్) తెలిపింది. రెండో బ్లాక్ బాక్స్ లో విమాన సాంకేతిక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దానిని విశ్లేషించినప్పుడు ఈ భయంకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. మొత్తం 25 గంటల సాంకేతిక వివరాలను ఈ రెండో బ్లాక్ బాక్స్ నిక్షిప్తం చేసింది. ఇందులో విమాన వేగం, ఎత్తు, పైలట్ మోడ్ ఏంటన్నవన్నీ రికార్డయ్యాయి.

  • Loading...

More Telugu News