: ఆడడం మా పని... రాజకీయాలు చేయడం కాదు: గుత్తా జ్వాల


టార్గెట్ ఒలింపిక్ పథకంలో చోటు కల్పించకపోవడంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. మలేసియాలో ఆమె మాట్లాడుతూ, ప్రశాంతంగా ఆడదామని ఎంత ప్రయత్నించినా, అలా జరగకుండా ఏదో ఒక వివాదంతో ప్రశాంతతను చెడగొడుతున్నారని చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక ఎవరున్నారో తనకు కాస్త అవగాహన ఉందని గుత్తా జ్వాల తెలిపింది. టాప్ సెలక్షన్ కమిటీలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఉన్నప్పటికీ డబుల్స్ క్రీడాకారిణులపై వివక్ష చూపడం విచిత్రంగా ఉందని ఆమె పేర్కొంది. దేశం కోసం ఆడుతున్నా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం అశ్విని పొన్నప్పను, తనను ఇబ్బంది పెట్టడానికే టాప్ పథకంలో తమను పక్కన పెట్టారని ఆమె పేర్కొంది. ఆడడం తమ పని అని, రాజకీయాలు చేయడం తమకు చేతకాదని జ్వాల తెలిపింది. జరుగుతున్న పరిణామాల వెనుక గత ఐదేళ్లుగా ఎవరున్నారో, ఇప్పుడు కూడా వారే ఉన్నారని ఆమె వెల్లడించింది. అయితే, దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆమె అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News