: ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకుని పదవి కోల్పోయిన గోవా మంత్రి


ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్న గోవా మంత్రిని సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. గోవా వికాస్ పార్టీ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో 2006 జూలై 15న విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న కపిల్ నటేకర్ ను దూషిస్తూ, చేయిచేసుకున్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై చేయిచేసుకోవడం ముమ్మాటికీ నేరమని చెబుతూ న్యాయస్థానం రూ.1500 జరిమానాతో ఆరునెలల జైలు శిక్షను విధించింది. దీంతో, సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలం నడిచిన ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో, ఆయన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టంలేక పదవికి రాజీనామా చేసినట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News