: 'శ్రీసిటీ'లో మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాం: ఇంద్రనూయి
చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్ లో మహిళలకే ఎక్కువ శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పెప్సీకో సీఈవో ఇంద్రనూయి చెప్పారు. రాబోయేది మహిళా శకమేనని ఆమె పేర్కొన్నారు. సెజ్ లో పెప్సీకో యూనిట్ ప్రారంభోత్సవం అనంతరం నూయి మాట్లాడారు. శ్రీసిటీలో తమ కంపెనీ రూ.1200 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పెప్సీకో సీఈవోగా ఇంద్రనూయి ఉండటం దేశానికే గర్వకారణమని అన్నారు. పది సంవత్సరాల్లో శ్రీసిటీని దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 11 పరిశ్రమల్లో 1950 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు.