: అక్కడ భర్తలే భార్యలకు చెడు అలవాట్లు నేర్పుతారట!
ఈశాన్య రాష్ట్రాల్లో భార్యలకు చెడు అలవాట్లు నేర్పేది భర్తలేనని ఓ సర్వేలో వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం భారతదేశంలోని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో దారుణమైన నిజాలు వెల్లడయ్యాయి. భర్తలే భార్యలను చెడు అలవాట్లకు బానిసలను చేస్తున్నారన్న చేదు నిజం వెల్లడైంది. ఆలుమగలు నల్లమందు తీసుకుంటున్నారని, భర్తలే భార్యలకు ఈ అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు వాడుతున్నారని, వీరిలో ఎక్కువ మందికి వివాహం జరిగిన తరువాతే ఇది అలవాటైందని సర్వే చెబుతోంది. ప్రతి వంద మందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందు తీసుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా మణిపూర్ మహిళలు (28.2) మత్తు పదార్థాలు అధికంగా తీసుకుంటున్నట్టు వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (17.4), నాగాలాండ్ (14.9), మేఘాలయ (12.1), అసోం (10.2), సిక్కిం (9.8) రాష్ట్రాల మహిళలున్నారు.