: ఇకపై నేను ఎమ్మెల్యేను కాను, విప్ పదవికి కూడా రాజీనామా చేస్తా... టీడీపీ నేత అలక


ఒంటిమిట్ట రాముడి కల్యాణోత్సవంలో తనను అధికారులు పట్టించుకోలేదని, ప్రొటోకాల్ పాటించలేదని రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి వాపోయారు. తన కుటుంబ సభ్యులకు సైతం గౌరవం ఇవ్వలేదని చెప్పారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటానని, ఇంకా చెప్పాలంటే, ఇకపై తాను ఎమ్మెల్యేను కాదని, రాజీనామా చేసినట్టేనని స్పష్టం చేశారు. మరో విషయం ఏమిటంటే, కడప జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News