: మోదీ తలచుకుంటే క్షణాల్లో ఏపీకి ప్రత్యేక హోదా: కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్


ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ నోరు విప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే, క్షణాల్లో ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. మోదీని ఒప్పించే పనిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇద్దరు నాయుడులు కలిసి ఏపీకి న్యాయం చేయాలని కూడా జైరాం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే, ప్రధాని మోదీపై ఒత్తిడి చేయకుండా చంద్రబాబు, వెంకయ్య నాయుడు కూడా ఏపీ ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకే తొలి ప్రాధాన్యమివ్వాలన్న ఆయన, పోలవరం తర్వాతే పట్టిసీమను చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News