: తెలంగాణ కోసం పోరాడిన వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులతో హింసిస్తోంది: భట్టి విక్రమార్క


టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన వర్గాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యహింసకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇందుకు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో ఛైర్మన్, అరుణోదయ గాయని విమలక్కే అతిపెద్ద ఉదాహరణ అని చెప్పారు. ఆమెపై తప్పుడు ఆయుధాల కుట్రకేసు పెట్టారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు తెలంగాణ సర్కారు పాల్పడుతోందని మీడియా సమావేశంలో తెలిపారు. అటు సాగునీరు అడిగిన ఐదుగురు ఖమ్మం జిల్లా రైతులపై కూడా అక్రమ కేసులు పెట్టారని, ఈ అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని భట్టి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News