: రేపు సాయంత్రం హస్తినకు చంద్రబాబు... మోదీ విందుకు హాజరుకానున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ సాయంత్రానికి హైదరాబాదు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరనున్న ఆయన రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. ఈ నెల 8న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో.. మోదీ విందుకు చంద్రబాబు హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.