: 8న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ... పనిచేయని మంత్రులకు ఉద్వాసన


కేంద్ర కేబినెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ పునర్వ్యవస్థీకరించేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యమివ్వాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం దిశానిర్దేశం చేయడంతో ఆయన అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో నేటి ఉదయం ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా పార్టీ ప్రముఖులంతా ఒక దరికి చేరారు. ఈ క్రమంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యం దక్కలేదన్న వాదనలతో ఇప్పటికే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా ఆలోచన చేస్తున్న మోదీ, కొద్దిసేపటి క్రితం దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పనితీరు సరిగా లేని పలువురు మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పనితీరు సరిగా లేని పలువురు మంత్రులను మోదీ గుర్తించారు. ఇక మిత్రపక్షాల స్థానంలో కాశ్మీర్ సీఎం ముఫ్తీ మొహ్మద్ సయీద్ కూతురు మెహబూబా ముఫ్తీకి కేంద్ర కేబినెట్ లో ఇప్పటికే స్థానం ఖరారైంది. మరోవైపు మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన నుంచి కూడా ఇద్దరు లేదా ముగ్గురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసేలోగా దీనిపై మోదీ కసరత్తు పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News