: సచిన్ బర్త్ డేకి కేక్ మనదే..
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వచ్చే బుధవారంతో 40వ పడిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సచిన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) నిర్ణయించింది. అందుకోసమని ఓ హైదరాబాదీ చెఫ్ తో 18 కిలోల భారీ కేక్ ను తయారు చేయించాలని కాబ్ నిర్ణయించింది. సచిన్ తన పుట్టిన రోజు నాడు కోల్ కతా రానున్నాడు. ఆ రోజున ముంబయి ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎలాగూ సచిన్ బర్త్ డే నాడు కోల్ కతాలోనే ఉంటాడు కాబట్టి, డ్రెస్సింగ్ రూంలో జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించాలని కాబ్ భావిస్తోంది.