: కెన్యా వర్శిటీ విద్యార్థులపై దాడిని ఖండించిన సోనియా


కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన భయానక దాడిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖండించారు. ఈ ఘటనపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అనాగరికమైన, అమానవీయమైన సంఘాలు లేదా కొంతమంది వ్యక్తులు మాత్రమే విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఇటువంటి దాడులకు పాల్పడతారని సోనియా అన్నారు. ఏ భావజాలం లేదా మతం ఇటువంటి చర్యలను సమర్థించుకోవడం సమంజసం కాదని సూచించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా కెన్యా ఘటనను ఖండించారు. సోమాలియా షెబాబ్ ముస్లిం గ్రూపు జరిపిన ఈ నరమేధంలో దాదాపు 147 మంది మరణించారు.

  • Loading...

More Telugu News