: రెండో బ్లాక్ బాక్స్ దొరికింది... కూల్చివేత మిస్టరీ వీడినట్టే!


ఫ్రాన్స్ లోని ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మన్ వింగ్స్ విమానానికి సంబంధించిన రెండో బ్లాక్ బాక్స్ (ఫ్లయిట్ డేటా రికార్డర్) ను సహాయక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. విమానం కూలిన రెండు రోజుల్లోనే తొలి బ్లాక్ బాక్స్ లభ్యమైన సంగతి తెలిసిందే. దీని ద్వారానే కో-పైలట్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కిందికి దించి కూలిపోయినట్టు చేసిన విషయం ఫ్రాన్స్ పరిశోధకులు బయటపెట్టారు. తాజాగా రెండో బ్లాక్ బాక్స్ కూడా లభ్యం కావడంతో విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News