: 'అన్ ఇండియన్' సినిమాలో డాన్స్ చేసిన బ్రెట్ లీ
'అన్ ఇండియన్' అనే సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీ డాన్స్ చేశాడని ఆ సినిమా డైరెక్టర్ అనుపమ్ శర్మ తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు సలీం-సులేమాన్ ద్వయం సంగీతం సమకూర్చిన ఓ పాటలో బ్రెట్ చిందులేశాడని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా, భారత్ సంస్కృతులు కలగలిసిన కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను ఆస్ట్రేలియా ఇండియా ఫిలిం ఫండ్ అనే సంస్థ నిర్మిస్తోంది. బ్రెట్ లీ ఆ పాటలో భారత సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తాడని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు.